Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీజేపీలో చేరనున్న ప్రముఖ నటి పూజాగాంధీ?

  • బీజేపీ కండువా కప్పుకోనున్న కన్నడ నటి పూజా గాంధీ?
  • యడ్యూరప్పను ఇప్పటికే పలుసార్లు కలిసిన నటి?
  • పార్టీ లోకి ఆమె రాకను వ్యతిరేకిస్తున్న కొందరు నేతలు
కన్నడ భాషతో పాటు పలు చిత్రాల్లో నటించిన ప్రముఖ నటి పూజాగాంధీ బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్పను ఆమె ఇప్పటికే పలుమార్లు కలిశారని సమాచారం. అయితే, బీజేపీలోకి పూజా గాంధీ చేరాలనుకోవడాన్ని ఆ పార్టీ నేతలు కొందరు వ్యతిరేకిస్తుండగా, మరికొందరు నేతలు ఆహ్వానిస్తున్నారు.

త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీలో పూజా గాంధీ చేరడం వల్ల పార్టీకి లాభమేనని సీనియర్ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె రాకను వ్యతిరేకించే వారిని సీనియర్ నేతలు బుజ్జగిస్తున్నట్టు సమాచారం. కాగా, పూజాగాంధీ ఇప్పటికే జనతాదళ్, జనతా పక్ష పార్టీలు మారారు.
kannada
puja gandhi

More Telugu News